Home ప్రకాశం మహిళల ఆర్థిక అభివృద్ధికి ఆసరా : వారోత్సవాల ముగింపు సభలో వైసీపీ నేతలు

మహిళల ఆర్థిక అభివృద్ధికి ఆసరా : వారోత్సవాల ముగింపు సభలో వైసీపీ నేతలు

385
0

– సంక్షేమ పథకాలతో మహిళలకు దన్నుగా నిలిచిన జగన్
– చేయూత ఆసరాతో మహిళల్లో స్వయం అభివృద్ధి
చీరాల : ఆసరా చేయూత వంటి ఆర్థిక ప్రయోజనాలు కలిగించిన సంక్షేమ పథకాలు మహిళలను మరింత అధికంగా అభివృద్ధి చేస్తాయని ఎమ్మెల్సీ పోతుల సునీత, ప్రత్యేక అధికారిని డాక్టర్ బేబీ రాణి, మాజీ మంత్రి డాక్టర్ పాలెట్ రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, పోతుల సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ జనం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు ఆధ్వర్యంలో ఈపురుపాలెం మార్కెట్ సెంటర్లో ఏర్పాటుచేసిన వైయస్సార్ ఆసరా వారోత్సవాల ముగింపు సభలో మాట్లాడారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేనేతలు, మహిళల అభివృద్ధికి మంచి రోజులు వస్తాయని ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు చేనేతలు మహిళల అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటుతో మహిళలు స్వయం ఉపాధి ద్వారా మరింత ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 1565 పొదుపు సంఘాల మహిళలకు రూ.13.46 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేస్తూ చెక్కును అందజేశారు. అనంతరం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు, గోలి గంగాధర్, జగదీష్, నాగూర్, నందం రవి,  మించాల సాంబశివరావు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పేర్లి నాని, దక్కుమల్ల ప్రేమ్, గోసాల అశోక్, షేక్ ఇస్మాయిల్, మళ్లీ రామకృష్ణ, దేవరపల్లి కుమార్ బాబు, డాక్టర్ మళ్లీ హరీష్ పాల్గొన్నారు.