వేటపాలెం : పందిళ్లపల్లి – వేటపాలెం మద్యలో ప్రధాన రహదారి వెంబడి ఉన్న చెట్టుకు యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మృతుని జేబులోని ఆధార్ కార్డు ఆధారంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన పోతురాజు దుర్గామల్లిఖార్జునరావు అనే యువకుడుగా పోలీసులు గుర్తించారు.
మృతదేహం తీరు చూస్తే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరు, ఎందుకు ఇక్కడికి వచ్చాడనే సమాచారం కూడా తెలియలేదు. ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? లేక నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా? వంటి అనుమానాలకు పోలీసుల విచారణలో పూర్తి సమాచారం వెలుగు చూసే అవకాశం ఉంది. ఘటనా స్థలాన్ని వేటపాలెం పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.