వేటపాలెం : ప్రకాశం జిల్లా వేటపాలెం చాకలివిధికి చెందిన స్వర్ణ అశోక్ (22) రామనగర్ వద్ద విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఏరియా వైద్యశాలలో ఉన్న మృతదేహాన్ని రూరల్ సిఐ వి భక్తవత్సలరెడ్డి, ఎస్ఐ వెంకటకృష్ణ పరిశీలించారు. పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.