చీరాల : మద్యం మత్తు ఒకరి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వారం రోజుల క్రితం జాండ్రపేటకు చెందిన బుజ్జి పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లి భార్యతో గొడవ పడుతుండగా కొడుకు బాజీ అడ్డు వెళ్లాడు. తనకు అడ్డు వచ్చాడన్న కోపంతో తండ్రి బుజ్జి కత్తితో కొడుకు బాజీని కడుపులో బలంగా పొడిచాడు. ప్రమాదంలో బాజీ పేగులు బయటపడి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లేలోపే మృతిచెందారు.
హత్యకు కారణమైన ముద్దాయి బుజ్జిని ఒకటో పట్టణ పోలీసులు హత్య చేశారు. ఈసందర్భంగా ఒకటో పట్టణ సిఐ వి సూర్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ మంచం తీయమన్న విషయంలో వచ్చిన తగాదలో కొడుకును కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ముద్దాయిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.