Home క్రైమ్ లారీ ఢీ కొట్టడంతో యువకుడు మృతి

లారీ ఢీ కొట్టడంతో యువకుడు మృతి

64
0

భట్టిప్రోలు (Battiprolu) : ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన 216 జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. ఎస్ఐ ఎ శివయ్య కథనం ప్రకారం గుంటూరు పట్టణానికి చెందిన మహమ్మద్ వలి (27) అనే యువకుడు చెరుకుపల్లి మండలం గూడవల్లిలో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గుంటూరు (Gunturu) నుండి గూడవల్లికి వచ్చి అక్కడి నుండి రేపల్లెకు (Repalle) తన వ్యక్తిగత పనులపై వెళ్లి తిరిగి వస్తుండగా సూరేపల్లి పరిధిలోని ఫ్లైఓవర్ దిగుతుండగా వెనుక నుండి వేగంగా లారీ దూసుకు వచ్చి బైకును ఢీ కొట్టింది. ఘటనలో వలి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుని భార్య పి సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.