Home బాపట్ల వైద్య కళాశాలల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి ర్యాలి

వైద్య కళాశాలల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి ర్యాలి

36
0

బాపట్ల (Bapatla): వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు జిల్లా కేంద్రమైన బాపట్లలో సోమవారం నిరసన ర్యాలి నిర్వహించారు. భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు పట్టణంలోని డిఎంపల్లి నుండి కోటి సంతకాల సేకరణ పత్రాల ప్రత్యేక వాహనంతో నాయకులు జిబిసి రోడ్డు ద్వారా చీలు రోడ్డు సెంటర్ వరకు ర్యాలీగా తరలించారు. వైద్య కళాశాలల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాల రాజధానికి తరలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ మెరుగ నాగర్జున మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల (Governament Medical Colleges) ప్రైవేటీకరణ విధానాన్ని విరమించే వరకు వైసిపి పోరాటం ఆగదన్నారు. నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన వైద్య కళాశాలల ప్రయోజనాలు పేదలకు అందనీయ కుండా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో తమ పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రైవేటీకరణకు తలుపులు తెరిచిందని ఆరోపించారు. ఈ విధానాన్ని విరమించుకోకపోతే ఉద్యమం చేపడతామన్నారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ఫలాలు పేదలకు అందనీయకుండా వైద్య వ్యాపారం చేసేందుకే పిపిపి (PPP) పద్ధతి తెచ్చారని ఆరోపించారు. కార్యక్రమంలో రేపల్లె, వేమూరు, అద్దంకి, పర్చూరు, చీరాల వైసిపి ఇన్‌ఛార్జిలు డాక్టర్‌ ఈఊరి గణేష్, వరికూటి అశోక్ బాబు, చింతలపూడి అశోక్ కుమార్, గాదే మధుసూదనరెడ్డి, కరణం వెంకటేష్ పాల్గొన్నారు.