Home బాపట్ల ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులతో ఆరోగ్యం

ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులతో ఆరోగ్యం

33
0

చీరాల : రోటరీ క్లబ్, ఎన్ఆర్ అండ్ పిఎం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రోటరీ కమ్యూనిటీ హాలు నందు డాక్టర్ ఇస్తర్ల బాబూరావు సారధ్యంలో షుగర్, గుండె జబ్బులపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ ధూమపానం, మద్యపానం మానివేసి, కార్బోహైడ్రేట్లు, కొవ్వు వున్న పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు గల ఆహారం తీసుకోవాలని అన్నారు. చిరుధాన్యాలు, ముడి బియ్యం, చిక్కుళ్ళు, బఠాణీలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, సమతులాహారం, ఆకలి అయినపుడు మాత్రమే తీసుకోవాలని చెప్పారు.

రోజు తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ, మానసిక ప్రశాంతత వలన చాలా జబ్బుల నుండి బయట పడవచ్చని అన్నారు. గుండెకు సంబంధించి ఏదైనా నొప్పిగా అనిపిస్తే డాక్టర్ని కలిసి వెంటనే ఈసీజీ తీయించుకొని డాక్టర్ సలహా పాటించాలని అన్నారు. షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ గురించి అన్ని విషయాలు విపులముగా తెలిపారు. కార్యక్రమంలో చందలూరి బాల వెంకటేశ్వరరావు, పోలుదాసు రామకృష్ణ, గ్రంథి నారాయణమూర్తి, జివై ప్రసాద్, డివి సురేష్, చింతా రమేష్, సుభాషిణి, వీరాంజనేయులు, గుర్రం బధిరి, పూర్ణా, తిరుపతిరావు, జి రమేష్, స్వామి, రోటరీ, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.