వేటపాలెం (Vetapalem) : స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో (StANNsEngCollege) ఫైధాన్ డి జాంగోపై 6 రోజుల వర్క్ షాపు విజయవంతంగా నిర్వహించారని కళాశాల సెక్రటరి వనమా రామకష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. కళాశాల సిఎస్‌ఇ, ఇంటర్‌నెట్ ఆఫ్ ధింగ్స్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 16 నుండి 21వరకు బిటెక్ 2వ సంవత్సరం విద్యార్ధులకు ఫైధాన్ డి జాంగోపై (Python DJango)6రోజుల వర్క్ షాపు నిర్వహించామని ప్రిన్సివాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ వర్క్ షాపును ఎపి స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సహకారంతో ఎస్ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఐఒటి విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్ తెలిపారు. ఫైధాన్ డి జాంగోపై విద్యార్ధులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. వాటిపై ప్రయోగాలు నిర్వహించారని తెలిపారు. ఆధునిక కంప్యూటర్ కోడింగ్‌లో ఫైధాన్ డి జాంగో ఎంతో ప్రాముఖ్యత వహిస్తున్నదని తెలిపారు. విద్యార్ధులు దీనిపై దృష్టిని పెట్టినట్లైతే విద్యార్ధులు ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు.






