చీరాల (DN5 News) : స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో డ్రోన్ టెక్నాలజీపై మూడు రోజుల వర్క్‌షాపు సోమవారం ప్రారంభమైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మార్చి 16 నుండి మూడు రోజులపాటు బీటెక్ 2వ, 3వ సంవత్సరం విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. రామ్‌సూర్ అగ్రియల్ ఎల్‌ఎల్‌పి సహకారంతో కె మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుందిన మెకానికల్ హెచ్‌ఒడి డాక్టర్ చావలి లక్ష్మీ తులసి చెప్పారు. పి హరీష్, బి రవికుమార్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, వనమా దొర నాగ సాయినాద్ పాల్గొన్నారు.






