Home బాపట్ల సెయింట్ ఆన్స్ విద్యార్ధులకు వర్క్‌షాప్

సెయింట్ ఆన్స్ విద్యార్ధులకు వర్క్‌షాప్

4
0

చీరాల (DN5 News) : స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ విద్యార్ధులకు వర్క్‌షాప్ బుధవారం ప్రారంభించారు. ఇసిఇ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి బీటెక్ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఎపి స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఎస్ మనోజ్ భరత్ ఆధ్వర్యంలో ఈ వర్క్‌షాప్ జరుగుతుందని డాక్టర్ ఎస్‌విడి అనిల్ కుమార్ చెప్పారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక వాహన రంగంలో ఎలక్ట్రికల్ వెహికల్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ రంగంపై అవగాహన పెంచుకుంటే విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ అక్రిడిటేషన్స్ డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ వనమా దొర నాగ సాయినాద్ పాల్గొన్నారు.