Home బాపట్ల సూరేపల్లెలో సిఎం చంద్రబాబు నాయుడు పర్యటన పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ డాక్టర్ వి...

సూరేపల్లెలో సిఎం చంద్రబాబు నాయుడు పర్యటన పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్

12
0

భట్టిప్రోలు, (DN5 News) : ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, ప్రజావేదిక నిర్మాణ పనులు వేగవంతనగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఈ నెల 9న (గురువారం) మండలంలోని సూరేపల్లెలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. సిఎం పర్యటనల కోఆర్డినేటర్‌ పి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే నక్క ఆనంద బాబు, ఎస్పీ బి ఉమామహేస్వర్, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. హెలిప్యాడ్ నిర్మాణం, ప్రజావేదిక పనులు పరిశీలించారు. సిఎం హాజరయ్యే కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట రేపల్లె, బాపట్ల, చీరాల ఆర్డిఓలు శ్రీదేవి, పి గ్లోరియా, చంద్రశేఖర్ నాయుడు, విద్యుత్ శాఖ ఎస్ఈ ఆంజనేయులు, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఎడి శేషగిరిరావు, డిఎస్ఓ ఆర్ జమీర్ బాషా, డిఎం అండ్‌ హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, పౌర సరఫరాల శాఖ డిఎం శ్రీలక్ష్మి, ఆర్ అండ్‌ బి డిఈలు అరుణ, నళిని, ఎస్ఈ పంచాయతీ రాజ్ రాజన్ బాబు, గ్రామీణ నీటి సరాఫరా శాఖ ఎస్ఈ. అనంతరాజు, డిఎండిఓ పద్మావతి, తహశీల్దారు వెంకటేశ్వర్లు, ఎంపిడిఓ వెంకటరమణ ఉన్నారు.