
చీరాల : కార్మిక చట్టాలు రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కారణంగా కార్మికులు అనేక హక్కులు కోల్పోతారని ట్రేడ్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. దేశవ్యాప్త కార్మిక సమ్మె చేయనున్న సందర్భంగా ఐఎల్టిడి కంపెనీ వద్ద కార్మిక సంఘాలు సంయుక్తంగా బుధవారం నిరసన వ్యక్తం చేశారు. కార్మిక సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని కోరారు. యజమానులకు అనుకూలంగా ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పనిగంటలు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వెంటనే రద్దు చేయాలని కోరారు.
మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణంలో కార్మిక ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. గత ఏడాది 17 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఐ ఎల్ టి డి కంపెనీ వర్కర్స్ యూనియన్, సిఐటియు, ఐఎన్టియుసి, టిఎన్టియుసి, వైఎస్ఆర్ టియు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.