చీరాల : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ ఎం శుభవాణి కోరారు. చీరాల కోర్టు ఆవరణలో జరిగిన మహిళా దినోత్సవ సభలో మాట్లాడారు. 1917సంవత్సరంలో దర్జీపనిచేసే మహిళలు ఒకే పనికి ఒకటే వేతనం కావాలని, పురుషులకు ఒకరకమైన వేతనం, మహిళలకు ఒకరకమైన వేతనం కలిగి ఉండటాన్ని వ్యతిరేకించి సమాన పనికి సమాన వేతనం కావాలని పొందారని చెప్పారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు.
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఇ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రేమ వివాహాల పేరిట ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అది చట్టరీత్యా నేరమని అన్నారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె వాసుబాబు, ఎ కొండమ్మ, శారద, వినీల, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.