నెల్లూరు : అనుమానం పెనుభూతమైంది. జీవితకాలం తోడుగా ఉండాల్సిన భర్తనే కిరాటకుణ్ణి చేసింది. ఆమె నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అల్లూరు మండల గోళ్లపాలెంకు చెందిన బెల్లంకొండ తిరుమల(32)కు శీనయ్యతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మొదట్లో సంసారం సాఫీగా ఉన్నప్పటికీ ఆతర్వాత ఆమెపై కలిగిన అనుమానం చివరికి హత్యకు దారితీసింది. ఊరిబయట పొలాల్లో ఆమెపై వారికోతల కొడవలితో దాడిచేశాడు. మెడపై వేటువేయడంతో ఆమె అక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది.