Home ఆంధ్రప్రదేశ్ రైతులతో రైతుబిడ్డగా…

రైతులతో రైతుబిడ్డగా…

12
0

బాపట్ల (భట్టిప్రోలు) (DN5 News) : పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కోసం గురువారం సూరేపల్లి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక రైతులు మురాల వెంకటేశ్వర్లు, వాకా శ్రీనివాసరావులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతులతో కలిసి వారి పొలంలోనే కలియ తిరుగుతూ సాగు వివరాలు, కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఒక రైతుబిడ్డగా తమతో ఆప్యాయంగా మాట్లాడడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పాస్ పుస్తకం వచ్చింది..!
నా పేరు మురాల వెంకటేశ్వర్లు. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం ప్రభుత్వం 25 సెంట్లు వ్యవసాయ భూమి ఇచ్చింది. కానీ పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు. అందుకని ఎలాంటి రుణం కూడా లభించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రీ సర్వే చేసి పాస్ పుస్తకం ఇచ్చారు. ఈ భూమిలో వరి సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాను. ప్రభుత్వం నుంచి పెన్షన్, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందుతున్నాయి. మాలాంటి పేదలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.