Home బాపట్ల ఏలూరి కృషితో కారంచేడుకు మహర్దశ

ఏలూరి కృషితో కారంచేడుకు మహర్దశ

11
0

కారంచేడు (DN5 News) : శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు కృషితో కారంచేడులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామంలో మౌలిక వసతులైన రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ.1.10 కోట్లు మంజూరు చేశారు. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు శాశ్వత పరిష్కారం చూపారు. ప్రస్తుతం గ్రామంలోని పలు ప్రధాన వీధులతో పాటు అంతర్గత గల్లీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైన్ల ఏర్పాటు పనులు చేస్తున్నారు. పనులు పూర్తయితే గ్రామంలో రాకపోకలు మరింత సులభతరమయ్యే అవకాశం ఉంది. వర్షాకాలంలో నీటి నిల్వ, మురుగు సమస్య పరిష్కారం అవుతుంది.