పర్చూరు (Parchuru) : మైసూరు అవధూత దత్త పీఠం జాతీయ స్థాయిలో నిర్వహించిన భగవత్ గీత కంఠస్థ పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో పర్చూరు మండల ఉపాధ్యక్షురాలు కోట ప్రసన్న ఉత్తీర్ణత సాధించారు. మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి (Mysure Datta Pitham Ganapathi Sachidananda Swami) చేతుల మీదుగా బంగారు పధకం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అవార్డు అందుకోవటం సంతృప్తి ఇచ్చిందని అన్నారు. తల్లిదండ్రులు సంస్కృతం భాషను పిల్లలకు నేర్పించాలని సూచించారు. భారతీయ గ్రంథాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయని విదేశీయులు సైతం ఈ భాష పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌జిఎస్ శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి సమేత అష్టలక్ష్మి దేవస్థాన ట్రస్టీ కోటా శ్రీనివాసరావు కుమార్తె డాక్టర్ ఆశాలత ఉన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పి సత్యనారాయణ, లగడపాటి వెంకయ్య, కోట సత్యం అభినందించారు.






