చీరాల : సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో విన్‌ఇన్‌ఫో సొల్యూషన్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో ఇద్దరు విద్యార్ధులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు.
గత సంవత్సర కాలంగా కోవిడ్‌తో కార్పొరేట్ కంపెనీలు కళాశాలకు వచ్చి క్యాంపస్ డ్రైవర్ నిర్వహించడానికి వీలు కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో వర్చువల్ పద్దతిలో క్యాంపస్ డ్రైవర్ నిర్వహించినట్లు తెలిపారు. బిటెక్ చివరి సంవత్సరం విద్యార్ధులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పొగడదండ రవికుమార్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ విభాగం నుండి పి ఇమ్రాన్, పి శశాంక్‌రెడ్డి ఎంపికైనట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఎంపికైన విద్యార్ధులకు రూ.2.40లక్షల వార్షిక వేతనం, ఇతర అలవెన్స్‌లు ఉంటాయని తెలిపారు. ఎంపికైన విద్యార్ధులకు సిఎస్‌ఇ హెచ్‌ఒడి డాక్టర్ పి హరిణి అభినందించారు.