Home బాపట్ల పట్టణ అభివృద్దికి కృషి చేస్తా : ఛైర్మన్‌

పట్టణ అభివృద్దికి కృషి చేస్తా : ఛైర్మన్‌

40
0

చీరాల (Chirala) : స్థానిక ఎన్‌ఆర్‌ అండ్‌ పిఎం ఉన్నత పాఠశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మునిసిపల్ ఓపెన్ ఎయిర్ ధియేటర్‌లో మునిసిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, ఎఎంసి చైర్మన్ కౌతవరపు జనార్ధనరావు, ఎఎంసి వైస్ చైర్మన్ శీరాం రమేష్‌ను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్మన్ సాంబశివరావు మాట్లాడుతూ వార్డుల్లో ప్రతి రోజు పర్యటింటి పారిశుధ్యం, మురుగు నీటి పారుదల వంటి పనులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. శాసన సభ్యులు కొండయ్య సహకారంతో పట్టణ అభివృద్ది, ప్రజా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ఎఎంసి చైర్మన్ జనార్ధనరావు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానేని తన పరిధిలో కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురు ప్రసాద్, నారాయణ మూర్తి, సుభాషిణి, హెడ్ మాస్టర్ సాల్మన్, వలివేటి మురళీకృష్ణ, డివి సురేష్, డాక్టర్‌ ఐ బాబూరావు, తిరుపతిరావు, చింతా రమేష్, గుర్రం బదరీనాథ్, గుద్దంటి రమేష్ బాబు, చెక్కా నారాయణ, దరియ సాహెబ్, దేవకి సుబ్బారావు, నరసింహరావు, శివాంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు.