– అటవీ, పర్యావరణ సంరక్షణ చట్టం అమలు చేయాలి
– అక్రమ లే అవుట్లు, రిసార్ట్ పేరిట లాడ్జిలు నిర్మాణం
– అధికారులే అనుమతులు మంజూరు చేస్తున్నారు
– నిబంధనల ఉల్లంఘన ఈప్రాంత ఉనికికే ప్రమాదం
– మీడియా సమావేశంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ .
చీరాల (DN5 News) : సముద్రతీరంలో పర్యాటక అభివృద్ధి పేరుతో అటవీ, పర్యావరణ సంరక్షణ చట్టానికి తిలోదకాలు ఇస్తున్నారని మాజీ ఎంఎల్‌ఎ ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. నిబంధనలకు లోబడి తీరంలోని మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా జరగాలని, కానీ అందుకు విరుద్ధంగా జరుగుతుందని అన్నారు. చీరాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సముద్ర తీరంలో (Coastal Regulation Zone)నిబంధనలకు విరుద్ధంగా ప్రవేట్ రిసార్ట్స్ నిర్మిస్తున్నారని అన్నారు. వీటి ఫలితంగా సముద్ర తీరంలో రిసార్ట్స్ పేరిట లాడ్జిలు వెలుస్తుండగా, బాపట్ల ప్రాంతానికి రిసార్టులు తరలి పోతున్నాయని అన్నారు.
వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కఠారివారిపాలెం సముద్ర తీరాన్ని ఆనుకొని అటవీ, పర్యావరణ సంరక్షణ చట్టనికి తూట్లు పొడుస్తూ జీవితాంతం వ్యవసాయానికి మాత్రమే వినియెగించాల్సిన భూముల్లో సైతం అక్రమ లే అవుట్లు వేశారని అన్నారు. తీర ప్రాంత అవసరాల నిర్మాణానికి మాత్రమే వినియోగించాలని చట్టం సూచిస్తున్నప్పటికీ అందుకు విరుద్ధంగా సాగుతున్న నిర్మాణాలు, అక్రమ లై అవుట్లఫై స్థానిక అధికార యంత్రాంగం, పంచాయితీ కార్యదర్శి చర్యలు తీసుకోకపోగా ఆయా నిర్మాణాలకు అనుమతులు సైతం మంజూరు చేసి, అధికార దుర్వినియాగానికి పాల్పడరని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శికి అనుమతులు ఇచ్చే అధికారమే లేదని అన్నారు.
ఇదే క్రమంలో సునామీ వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పెద్ద ఎత్తున ప్రభావితమైన నిషిద్ధ ప్రాంతంలో ఒక్కటైన పొట్టి సుబ్బయ్య పాలెం తీరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి లేఔట్ వేసి, ఏమి తెలియని ప్రజలకు అంటగడుతున్నారని అన్నారు. కాగా తీరంలోని వాస్తావ పరిస్థులను కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసువెళ్లినట్లు తెలిపారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి చర్యలకు ఆదేశించినట్లు ఆమంచి తెలిపారు. మరోవైపు చీరాల సముద్ర తీరం పొడవునా ఇలాంటి అక్రమ లేఅవుట్లు చాలా ఉన్నాయని, వీటిలో ఫ్లాట్లు కొని పెట్టుబడులు పెట్టేవారు అన్ని తెలుసుకొని ఒక్కటికి రెండు సార్లు పరిశీలించి స్థలాలు కొనాలని సూచించారు. చీరాల ప్రాంత ప్రజల ప్రయెజనాలు, అభివృద్ధి మాత్రమే దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తామని అన్నారు. వ్యక్తిగత ప్రయెజనాలు ఆశించే వ్యక్తిత్వం తనది కాదన్నారు. తన రాజకీయ జీవితంలో ఎపుడు వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని రాజకీయం చేయలేదని, వ్యవస్థను దృష్టిలో ఉంచుకొనే రాజకీయం చేస్తానన్నారు. భవిష్యత్తులో సైతం ఇదే పంథా కొనసాగిస్తాన్నారు.






