Home ప్రకాశం తిరునాళ్లలో ఎయిడ్స్‌పట్ల విస్తృత ప్రచారం

తిరునాళ్లలో ఎయిడ్స్‌పట్ల విస్తృత ప్రచారం

9
0

అద్దంకి (DN5 News ) : హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కృషి చేయాలని హెల్ప్‌ సంస్థ డైరెక్టర్‌ బివి సాగర్‌ (Healp Director BV Sagar) కోరారు. హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, ఏ విధంగా సోకుతుంది, సుఖ వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయనే విషయాలను ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మండలంలోని సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల సందర్భంగా దేవాలయానికి విచ్చేసే భక్తులకు ఎపి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, దిశా ఆధ్వర్యంలో అవగాహన కలిగించే స్టాల్, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన భక్తులకు కరపత్రాలు, వాల్ పోస్టర్‌ల ద్వారా అవగాహన కల్పించారు.

హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డి దుర్గా సురేంద్ర స్టాల్‌ను సందర్శించిన వారికి తప్పని పరిస్థితుల్లో బయట వ్యక్తులతో శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్ వాడాలని, కండోమ్ ఏ విధంగా వాడాలి, కండోమ్ లేకుండా విచ్చలవిడి శృంగారంలో పాల్గొంటే వచ్చే సుఖ వ్యాధుల గురించి వివరించారు. సుఖ వ్యాధులపైన తగు సూచనలు సలహాలు కొరకు జాతీయ టోల్ ఫ్రీ 1097కు సమాచారం తెలియజేసి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. రోజు రోజుకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి చాప కింద నీరు లాగా రోగుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ జై సింహ, డాక్టర్ శ్రీహర్ష, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అద్దంకి, కోరిసపాడు ఔట్రిచ్ వర్కర్లు టి దుర్గాభవాని, డి హర్షిత, ఆర్ కృష్ణవేణి, ఎ ఎన్ఎం మౌనిక, పిఈలు వి మల్లేశ్వరి, సంధ్యారాణి, శివ పార్వతి, పార్వతి పాల్గొన్నారు.