Home ప్రకాశం ప్రభుత్వ సొమ్మును యధేచ్చగా దుర్వినియోగం చేస్తున్న జగన్ : కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి

ప్రభుత్వ సొమ్మును యధేచ్చగా దుర్వినియోగం చేస్తున్న జగన్ : కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి

402
0

ప్రకాశం : మైనింగ్ భూముల్లో జగన్ ప్రభుత్వం ఇండ్లస్థలాలు కేటాయించడాన్ని హైకోర్టు స్టే విధించిందని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. మైనింగ్ భూముల్లో లే ఔట్ల కోసం కోట్ల ప్రజా ధనం దుర్వినియోగానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు నివేసన పట్టాలు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. కానీ ఈ నివేశ స్థలాల పట్టాలు ఇచ్చేముందు తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో గుర్తించిన లబ్ది దారులకు అప్పుడు నిర్మించిన గృహాలను ముందుగా కేటాయించాలని కోరుతున్నామన్నారు.

ఇప్పుడు ఒంగోలు, టంగుటూరు మండలాలలోని యర్రజర్ల, సర్వేరెడ్డిపాలెం, మర్లపాడు, కందులూరు, కొణిజేడు రెవిన్యూ గ్రామాల పరిధిలోని కేంద్ర గనుల శాఖ పరిధిలో గల భూములలో ఇళ్ల పట్టాలు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, ఈ మైనింగ్ భూములలో నిర్మాణాలు చేపట్టాలంటే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయనే గతంలో తమ ప్రభుత్వంలో ట్రిపుల్ ఐటీ నిర్మాణాలు చేపట్టలేదన్నారు. ఈ విషయం ఈ ప్రభుత్వానికి తెలిసి కూడా అధికారులు లే ఔట్లు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ లే ఔట్లలో ఇప్పటి వరకు షుమారు రూ.40కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారముందన్నారు. ఇప్పుడీ నష్టాన్ని ఎవరు భరిస్తారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రక్క ప్రజాధనాన్ని పొదుపు చేయాలని రివర్స్ టెండెరింగంటూ ఉండటం, ఇక్కడేమో అధికారులు, ప్రజాప్రతినిధుల ఓత్తిళ్ళతోనో, అనాలోచితమో, ఆశ్రీత పక్షపాతమో, అత్యుత్సాహమో కానీ ప్రజల సొమ్ముని మాత్రం యధేచ్చగా దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. దీనికి తప్పనిసరిగా అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.