Home ఆంధ్రప్రదేశ్ పాలకులు కళ్ళు తెరవాలంటే ఇంకెన్ని బొట్లు మునగాలి? గోదావరిలో బోటు ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

పాలకులు కళ్ళు తెరవాలంటే ఇంకెన్ని బొట్లు మునగాలి? గోదావరిలో బోటు ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

500
0

విశాఖపట్నం   : గోదావరిలో బోటు మునగడం- పర్యాటకులు పదుల సంఖ్యలో జలసమాధి కావడం కొత్త కాదు. ప్రమాదం జరిగిన ప్రతిసారీ కన్నీళ్లు పెట్టుకుంటున్నాం. కానీ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు మాత్రం చూసీ చూడనట్లు వదిలేదుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారానికి వచ్చాక ఒకలాగా మాట్లాడటం నేతలకు అలవాటైంది. ఇలాంటి అలవాటకు జగన్ అతీతమనుకున్నారు. కానీ ఆయన అలాగే వ్యవహరించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలోనూ బోటు ఇలాగే మునిగి పోయింది. అప్పుడు పదుల సంఖ్యలో పర్యాటకులు జల సమాధి అయ్యారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రూ.10లక్షలు పరిహారం ప్రకటిస్తే పాతిక లక్షలు ఇవ్వాలని జగన్ అప్పట్లో డిమాండ్ చేశారు. పర్యాటక శాఖపై ఆరోపణలు చేశారు. పర్యాటక శాఖ, అధికారులు, టిడిపి నేతలు అవినీతికి పాల్పడి బోటులపై పర్యవేక్షణ లేని కారణంగానే ప్రమాదం జరిగిందని అన్నారు.

మరి తాజాగా జరిగిన బోటు ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పాతిక లక్షలు ఇచ్చారా? పర్యాటక శాఖపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏమిటి? ఇప్పటి ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు. దీనికీ చంద్రబాబునే నిందిద్దామా? ప్రమాదానికి కారణాలేమిటి. అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఏ ప్రశ్న వేసుకున్నా సమాధానం ప్రభుత్వం, అధికారుల పనితీరునే ఎత్తిచూపుతున్నాయి.

ప్రమాదానికి కారణాలేమిటో ఒక్కసారి చూడండి.
1. గోదావరి, పాపికొండల పర్యాటకుల కోసం పర్యాటకశాఖ బొట్లు ఏర్పాటు చేసింది. కానీ వాటిని వినియోగంలో పెట్టకుండా ప్రయివేటు బొట్లకు అనుమతి ఇవ్వడంలో మర్మమేమిటి?
2. ఎగువన కురిసిన వర్షాలకు గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు నిండి వరద ఉదృతంగా ఉంది. 5లక్షల క్యూసెక్కుల నీటిని వదిలిన సంగతి తెలిసి కూడా బోతును ఎలా అనుమతించారు.
3. 50మందికి మించి ప్రయాణికులు ఎక్కడదన్న నిబంధనను గాలికొదిలి 73మందిని ఎక్కించుకుంటే నియన్తరించాల్సిన పర్యాటక, పోలీస్ అధికారులు ఎందుకు వదిలేశారు.
4. పర్యాటకులు అందరూ విధిగా లైఫ్ జాకెట్లు ధరించాలనే నిబంధన ఎందుకు అమలు చేయడంలేదు. అసలు అందరికీ చాలినన్ని లైఫ్ జాకెట్లు ఉన్నాయా?
5. అత్యవసర పరిస్థితుల్లో బోటు ఇంజిన్ మొరాయిస్తే రెండో ఇంజిన్ సిద్ధంగా ఉండాలి. కానీ ఆబోటులో రెండో ఇంజిన్ ఉందా? అదీ పనిచేసే స్థితిలో ఉందా? విచారణలో తెలియాలి.
6. అనుభవం ఉన్న డ్రైవర్, అవగాహన ఉన్న సారంగు ఉండాలి. అలాంటి వారైతే కచులూరు సుడిగుండాలవైపు తీసుకెళ్లారు.
7. పోలవరం నిర్మాణంతో గోదావరి దారి మల్లించారు. అందుకు చాలా చోట్ల గోదావరి ప్రవాహానికి అడ్డంకులు ఉండటంతో ప్రవాహ వేగం పెరిగింది.
8. వరదల సమయంలో గోదావరిలో సుడిగుండాలు ఉంటాయి. కచులూరు మందం, మంగుటూరు, దేవుడిగొండ రేవుల మధ్యలో సుడులు ఉంటాయి. అటుగా వెళ్లకూడదు.

ప్రత్యామ్నాయం ఏమిటి?
1. వరదల సమయంలో గోదావరి ప్రయాణానికి, పర్యటనకు వెళ్లకూడదు
2. ప్రతిఒక్కరు లైఫ్ జాకెట్లు ధరించాలి
3. 50మందికి మించి ఒక్కరు కూడా బోటు ఎక్కకూడదు.
4. వేసవిలో విహార యాత్రకు అనుకూలమైన వాతావరణం కాబట్టి అప్పుడు వెళితే మంచిది.