అమరావతి : ఎపి రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అంశంతో జనంలో ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ మూడు రోజుల క్రితం డిల్లీ వెళ్లారు. మంగళగిరిలో భవన కార్మికుల కోసం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత డిల్లీ నుండి కబురు వచ్చింది. అంతే ఆకస్మికంగా డిల్లీ ప్రయాణమయ్యారు. డిల్లీ ఎయిర్‌పోర్టులో దిగే వరకు మీడియాలో కనిపించారు. ఆతర్వాత మూడు రోజులుగా మీడియాకు కూడా చిక్కకుండా ఉన్నారు. మూడు రోజులుగా మీడియాలోనూ పవన్ కళ్యాణ్‌పై చూపే వార్తలకు పాత విజువల్స్‌నే వాడుతున్నారు. అయితే ట్విట్టర్‌లో మాత్రం శనివారం స్పందించారు. ఇసుక జగన్ కాళ్లచుట్టూ తిరుగుతున్నట్లు ఫోటో పోస్టు చేశారు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. హుటాహుటిన ఢిల్లీ వేళ్ళడానికి కారణమేమిటి? ఆయన ఎవరితో భేటీ కానున్నారనేది రాజకీయ వర్గాల్లో మీడియా వర్గీయులలో చర్చనీయ౦గా మారింది. పవన్ డిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌కు తిరుగుపయనమైన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడతారని మీడియాకు సమాచారం అందింది. పవన్ ఢిల్లీ పర్యటన గురించి పవన్ ఏం చెబుతారా…? అని జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు వేచి చూస్తున్నారు. ఆదివారం మద్యాహ్నం జరుగుతుందనుకున్న మీడియా సమావేశం జగరలేదు. పవన్ డిల్లీ పర్యటన రహస్యం ఎమిటి? పవన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.