Home ప్రకాశం జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు : ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి

జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు : ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి

70
0

పర్చూరు (Parchuru) : వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (CM YS Jaganmohanreddy) సీఎం అయితేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి (Ayodhya RamiReddy)  అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో జరిగిన సిద్ధం సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. ఆయనకు వైసిపి ఇంచార్జి యడం బాలాజీ (Yadam Balaji) ఆహ్వానించారు. యడం బాలాజీ మాట్లాడుతూ పేదలకు మళ్ళీ సంక్షేమ పథకాలు అందాలన్నా, నాడు – నేడు బడులు బాగుపడాలన్నా మళ్ళీ జగన్ సీఎం కావాలన్నారు. చివరి సిద్ధం సభకు అందరూ కలిసి రావాలని కోరారు.

అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ బిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని అన్నారు. మైలవరంలో సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపించబోతున్న ధైర్య వంతుడు జగన్మోహన్‌రెడ్డి అన్నారు. సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇవ్వడంపై జగన్ ధైర్యాన్ని మెచ్చుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిద్ధం సభ అనంతరం అక్కడి నుండే పర్చూరు ఎన్నికల శంఖారావం పూరించాలని అన్నారు. 175నియోజకవర్గాల్లో గెలిచే మొదటి నియోజకవర్గం పర్చూరే కావాలని గట్టిగా నినాదం చేశారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కల్లం సాయి, నాయకులు కఠారి అప్పారావు, నీరుకట్టు వాసుబాబు, బండారు ప్రభాకరరావు, కొల్లా వెంకట్రావు, నాగేశ్వరరెడ్డి, గాజుల రమేష్, షేక్ బాబుల్లా, మైలా చిన్న నాగేశ్వరరావు, గోరంట్ల శివకుమారి, తులసి నాగమణి, షేక్ కాలేష, పఠాన్ కాలేష, బండి నాగేంద్రం, పాలేరు వీరయ్య, పేరం సుబ్బారావు, కంచెనపల్లి రమేష్, గాదె సురేష్, కట్టే ప్రభుదాసు, జంగా అనిల్, ఆకుల హేమంత్, కూరాకుల ఇస్సాకు పాల్గొన్నారు.