Home ప్రకాశం ప్రజాసంక్షేమమే జగన్ ద్యేయం : వల్లూరమ్మ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సూరం రమణారెడ్డి

ప్రజాసంక్షేమమే జగన్ ద్యేయం : వల్లూరమ్మ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సూరం రమణారెడ్డి

497
0

టంగుటూరు (దమ్ము) : ప్రజల సంక్షేమమే ద్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని వల్లూరమ్మ ట్రస్ట్ మాజీ ఛైర్మన్, వైస్సార్ సీపీ నాయకులు సూరం రమణారెడ్డి అన్నారు. సిరిపురపు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కారుమంచి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఐసిడియస్ ప్రాజెక్టు ఒంగోలు వారి సౌజన్యంతో జరిగిన వైయెస్సార్ సంపూర్ణ పోషణ పౌష్టికాహార వారోత్సవాల సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి నవరత్నాలు ప్రకటించారన్నారు.

2019 ఏప్రిల్11 నాటికి డ్వాక్రా మహిళల పూర్తి బకాయిలు చెల్లిస్తానని చెప్పిన విధంగా నవరత్నాలలోని అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఐదేళ్లలో చేద్దాంలే అని ఎన్నికలకు ముందు ఒకటొరెండో కార్యక్రమాలు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్థితును జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక సంవత్సరంలోనే 90%శాతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని చెప్పారు. జగన్ చెప్పింది చెప్పినట్లు చేస్తూ 5విడతల్లో డ్వాక్రా మహిళల రుణాలు అన్ని పూర్తి చేస్తాడని అన్నారు. ఇప్పటికే తమ గ్రామంలో మూడు కోట్లకు గాను మొదటి విడతగా రూ.80లక్షలు అకౌంట్లలోకి వచ్చాయన్నారు. 45నుండి 60ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఐదేళ్లకు 18,750 గాను ఇప్పటికే 75 వేలు అకౌంట్లలో వేశారన్నారు. ఇలా రైతు భరోసా వంటి కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారన్నారు.

కార్యక్రమంలో అంగన్ వాడి సూపర్ వైజర్ రమాదేవి, గ్రామ నాయకులు, సోసైటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఘడియం శ్రీనివాసరెడ్డి, కాపా శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్ అభ్యర్థి నీరుకొండ శింగయ్య, మన్నం వెంకటేశ్వర్లు, మల్లవరప్పాడు, కారుమంచి, మహిళా పోలీసులు, ఆయాలు, టీచర్లు, గర్బిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.