Home బాపట్ల చేనేత వస్త్రాలను ధరించండి

చేనేత వస్త్రాలను ధరించండి

6
0

చీరాల (DN5 News) : రాష్ట్ర చేనేత, జోళి శాఖ ఆధ్వర్యంలో శాసన సభ ఆవరణలో చేనేత స్టాలు గురువారం ఏర్పాటు చేశారు. ‘చేనేత వస్త్రాలు ధరించండి, ప్రాచీన కళను కాపాడండి, మన దేశ చేనేత (Chenetha) కళాత్మక సంపదను ప్రోత్సహించి కాపాడండి’ అనే నినాదంతో స్టాల్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో పేరు గాంచిన వస్త్రాలు ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ సందర్భంగా శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు, శాసన సభ్యులు స్టాల్స్‌ను సందర్శించారు. వారికి నచ్చిన వస్త్రాలు కొనుగోలు చేశారు. ఈ స్టాల్స్‌లో చీరాలకు ప్రత్యేకంగా నిలిచి ఇటీవల జాతీయ గుర్తింపు పొందిన కుప్పడం చీరను మంత్రి సవిత కొనుగోలు చేశారు. స్టాల్‌ను సందర్శించిన వారిలో శాసన సభ్యులు ఎంఎం కొండయ్య ఉన్నారు.