Home ప్రకాశం అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : యుటిఎఫ్

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : యుటిఎఫ్

256
0

చీరాల : సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ సిపిఎస్ ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ ఒకటో తేదీన మిలీనియం మార్చ, సిఎంఓ కార్యాలయం ముట్టడి పిలుపునిచ్చి ఉన్నారు. అయితే ప్రభుత్వం పోలీస్ బలగాలను ఉపయోగించి ఉద్యోగ ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టులు చేయడం, నిర్బంధించడం, నోటీసులు జారీ చేయడం, మహిళలకు సైతం నోటీసులు జారీ చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ నాయకులు తెలిపారు.

చీరాల వన్ టౌన్ పరిధిలో సుమారు 252 మంది ఉద్యోగులకు, 22 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. వీరిలో మహిళలు కూడా ఉండటం గమనార్హం అన్నారు. పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ఎదుట పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఉన్న హక్కులను కాలరాస్తూ చేపట్టిన అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని యుటిఎఫ్ నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీబాషా, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్ర రామారావు, సీనియర్ నాయకులు కే వీరాంజనేయులు, జి సూరిబాబు, కుర్ర శ్రీనివాసరావు, పిచ్చయ్య, సతీష్ తదితరులు ఉన్నారు.