బాపట్ల : తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.200లకే పురపాలక సంఘం మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. పట్టణ ప్రజలకు తాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పట్టణంలో నీటి కుళాయి కనెక్షన్ లేని తెల్లకార్డు దారులందరూ ధరకాస్తు చేసుకోవాలని కోరారు.