Home ప్రకాశం విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నపుడే సమాజం అభివృద్ధి : దేవరాజు

విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నపుడే సమాజం అభివృద్ధి : దేవరాజు

462
0

చీరాల : విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణించి ఉన్నత శిఖరాలు చేరుకుంటారని, అప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుందని రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి అధ్యక్ష కార్యదర్శులు ఆర్ వి రమణ, తాడివలస దేవరాజు, బి హేమంత్ కుమార్ పేర్కొన్నారు. చీరాల రోటరి క్లబ్ క్షిరపురి ఆధ్వర్యంలో శుక్రవారం శృంగారపేట ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ముళ్ళమరు పార్వతి సహకారంతో వాటర్ బాటిల్ లు, హ్యాండ్ వాషింగ్ సంబంధించిన సబ్బులు, వస్తువులను అందజేశారు.

ఈ సందర్భంగా రమణ , దేవరాజు, హేమంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యత నివ్వాలని తెలిపారు. మల, మూత్ర విసర్జన తర్వాత భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. ప్రముఖ న్యాయవాది హేమంత్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణం, పరిరక్షణకు విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో మొక్కలను ఇష్టారాజ్యంగా నరికివేయడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతిందన్నారు. దీని పర్యవసానమే ఎండలు విపరీతంగా పెరగటానికి కారణమన్నారు.