రాచెర్ల : ఆరోడ్డులో నడవాలంటే నరకమే. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డు కనిపించదు. అంతా బురద. గట్టినేల వెతుక్కుని అడుగులు వేయాలి. అదెక్కడో కాదు. అనుమాలవీడులోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ బీసీ హాస్టల్ కు పోవు రోడ్డు. చిన్నపాటి వర్షానికి కూడా కుంటల మారిపోతుంది. నిత్యం వైద్యశాలకు వచ్చేపోయే ప్రజలు, హాస్టల్ విద్యార్థులు ఇబ్బంఫులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే బురదలో జారిపడి పుస్తకాలు తడిసి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని రోడ్డులో బురాడకుంటాలు పూడ్చి నీటిపారుదల సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు.