– వీ.ఆర్.యస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా గాంధీ వర్ధంతి
– నివాళులు అర్పించిన విద్యార్థులు
చీరాల : మహాత్మా గాంధీ జీవితాన్ని విద్యార్థులు స్పూర్తి గా తీసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వీఆర్యస్, వైఆర్ఎన్ ఇంజినీరింగ్ కళాశాల జీఎం పట్టాభి దానయ్య, సీఏఓ అబ్దుల్ సత్తార్ లు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి ని పురస్కరించుకుని బుధవారం కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు గాంధీ గురించిన సమాచారంతో పాటు చీరాలతో ఆయనకున్న అనుబంధాన్ని వివరించారు. జాతిపిత సిద్దాంతాలు తెలిపారు. మహాత్ముడు చెప్పిన విషయాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జీఎం దానయ్య, సీఎఓ సత్తార్ లు మాట్లాడుతూ గాంధీ ప్రతి విషయాన్ని తాను ఆచరించిన తరువాతే అందరికి చెప్పారని తెలిపారు. అందుకే అయన సిద్దాంతాలు నేటికి ఆచర నీయమన్నారు. యలమంచిలి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలను గాంధీ సిద్దాంతాలుతో నడుపుతున్నామన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివితే లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈకార్యక్రమంలో సహాయ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.