Home ఆంధ్రప్రదేశ్ చీరాలలో విశ్వాస్ హాస్పిటల్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, చీరాల మాజీ ఎమ్మెల్యే...

చీరాలలో విశ్వాస్ హాస్పిటల్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్

895
0

 

చీరాల : సాల్మన్ సెంటర్ సిపాయిపేటలో విశ్వాస్ హాస్పిటల్ ను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్ ప్రారంభించారు. అనంతరం విశ్వాస్ హాస్పిటల్ ఎండీ ఉపేంద్ర శోభనాద్రి మాట్లాడుతూ గుంటూరులో 3 బ్రాంచులు ఉన్నాయని, చీరాలలో నాలుగో బ్రాంచ్ ఏర్పాటు చేశామన్నారు. విశ్వాస్ హాస్పిటల్ పేదల కార్పొరేట్ హాస్పిటల్ అని, చీరాల ప్రజలుకు మంచి సేవలు అందిస్తామని అన్నారు. గత ఏడాది నుంచి తమ వైద్యశాలలో అన్ని వ్యాధులకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా అన్ని వ్యాధులకు నిపుణులైన డాక్టర్లచే వైద్యసేవలు అందించి అన్నీ వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తామని చెప్పారు.

డాక్టర్ వీ ఉమా ఉపేంద్ర మాట్లాడుతూ విశ్వాస్ హాస్పిటల్ అంటే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని పేరువున్నదన్నారు. ఆ పేరుని సార్ధకం చేసుకోవాలంటే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు కూడా అందుబాటులోకి తీసుకు రావాలని ఆశించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా అన్ని రకాల వైద్యసేవలను ఇక్కడే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గత ఏడాది కాలంగా తమను ఆదరించిన విధంగా ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, నాయకులు పాల్గొన్నారు.