చీరాల (DN5 News): పట్టణంలోని విజ్ఞానభారతి జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయ ప్రభంజనం సృష్టించారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృంధం ఉత్తమ విద్యా బోధనతోనే అత్యధిక మార్కులు సాధించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మేజర్ తోట రోశయ్య తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపిసిలో పొట్టూరి సురవందిత లక్ష్మీ 466, సప్రమ్ సృజనా శంకర్, నాసిక అనీష్ సూర్య 465, జూనియర్ బైపిసిలో వేమ చరణ్ దత్త 432, షేక్ రజీనా 426, సీనియర్ ఇంటర్ ఎంపిసిలో శిరిగిరి తనుశ్రీ చౌదరి, అందె మధులత, యారాసు సాద్వి కౌసల్య వెయ్యికి 984, బైపిసిలో గొర్రెముచ్చు నిర్మలాదాస్ వెయ్యికి 963 మార్కులు సంపాదించినట్లు తెలిపారు. కళాశాలలో శనివారం జరిగిన అభినందన కార్యక్రమంలో డైరెక్టర్స్ టి భూపేంద్రరావు, ఎం బ్రహ్మయ్య, జి సుబ్బారావు, అకడమిక్ డైరెక్టర్ జి రామాంజనేయులు, ప్రిన్సిపాల్ పి నాగమల్లేశ్వరరావు విద్యార్థులను అభినందించారు.