Home ప్రకాశం రోటరీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

రోటరీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

197
0

చీరాల : అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాండ్రపేట శివాలయంలో మంగళ, శనివారాలు పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం 60మంది పేదలకు అన్నదాన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగ మాజీ సుబేదార్ గౌరాబత్తిని బాబురావు హాజరయ్యారు. మిలటరీలో 28సంవత్సరాలు దేశం కోసం సేవ చేశానని తెలిపారు. అదే స్ఫూర్తితో వేటపాలెం రోటరీ క్లబ్బులో సభ్యులుగా చేరేందుకు సిద్ధత వ్యక్తం చేశారు. బాబురావును దృశ్యాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు బట్ట మోహనరావు, కార్యదర్శి ఏవి సురేష్ బాబు, గుత్తి, పరంజ్యోతి, సీతారామయ్య, మణికంఠ, పద్మాకరరావు తదితరులు పాల్గొన్నారు.