చీరాల : ఇంచార్జి, మాజీ ఎమ్యెల్యే ఆమంచి కృష్ణ మోహన్ రామన్నపేటలో వేంచేసియున్న శ్రీ కానక నాగవరపమ్మ అమ్మవారిని దర్శించుకొని కరోనా నిబంధనల ప్రకారము పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా జరిగే అమ్మవారి తిరునాళ్ల ఈకరోనా కారణముగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా గుడి కమిటీ చర్యలు చేపట్టారు. కమిటీ ఆహ్వానం మేరకు ప్రతి ఏటా జరిగే ఆచార ప్రకారం కృష్ణ మోహన్ చేతుల మీదుగా ఉదయాన్నే పూజలు నిర్వహించారు. కార్యక్రమములో దేవాలయ కార్యదర్శి పోతిన శ్రీనివాసరావు, కార్యదర్శి దాసు, గ్రామ కార్యదర్శి ప్రసాదరావు, దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ అచ్చింసెట్టి భానుమూర్తి, మాజీ డైరెక్టర్ బండ్ల బాబు, సినీ నటుడు అజయ్ ఘోష్, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.