చీరాల : లాక్ డౌన్ పొడగింపు కారణంగా పనులు లేక ఇబ్బంది పడుచున్న పేదలకు తక్కువ ధరలకే కూరగాయలు పంపిణీచేయాలన్న ఉదేశ్యముతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. చీరాల ఎఎంసి చేపట్టిన సంచార కూరగాయల విక్రయ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వైయస్సార్ జనతా రైతు బజార్ గా నామకరణ చేశారు. రాష్ట్రములోనే జిల్లాలో మొట్టమొదటిగా ఏఎంసీ ఆధ్వర్యములో వైసిపి నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణ మోహన్ సలహాతో మహిళా సమాఖ్య ద్వారా రూ.100కే 13 రకాలైన కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని చీరాల నెహ్రు కూరగాయలు మార్కెట్ వద్ద ఆదివారం చేపట్టారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగొరీ, డైరెక్టర్ కనపర్తి బజ్జిబాబు, చుక్క బుజ్జి, ఏఎంసీ సిబంది, మండలి సమాఖ్య సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.