చీరాల : రోటరీ క్లబ్ క్షీరపురి వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్డగడ్డ మల్లికార్జున్, చిరుమామిళ్ల రమేష్ కుమార్, సుప్రియ సహకారంతో వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ తమిళ శరణార్థుల కాలనీ (శిలోన్)లో శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి, చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సంయుక్తంగా ఒక్కొక్క కుటుంబానికి ఏడు కేజీల చొప్పున 150 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. పేరాల కుందేరు దగ్గర ఉన్నటువంటి నిరుపేదలు 110మందికి టమాటో రైస్, పెరుగు అన్నం పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా అడ్డగడ్డ మల్లికార్జున్ మాట్లాడుతూ ఏప్రిల్ 2 నుండి ప్రతిరోజు 400 మందికి సాంబారు రైస్, పెరుగు అన్నం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రావి వెంకటరమణ, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ తాడివలస దేవరాజు, కాసా మురళి, కాసా వంశీ, జంగా ఆనంద్ బాబు, అశోక్ కుమార్, నరేంద్ర, ఆనంద్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.