చీరాల : వైయస్సార్ కాంగ్రెస్ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు సూచనల మేరకు మించాలా సాంబశివరావు చీరాల గంజిపాలెం 19వ వార్డులో 750 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు గంజిపాలెంలో కూరగాయలు పంపిణీ చేస్తున్నామని, ఇలాగే ప్రతి ఒక్క దాత ముందుకొచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
వేటపాలెం మండలం పాపాయపాలెంలో పులి వెంకటేశ్వర్లు, పులి శ్రీను 500కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. కోటి వెంకటరావు, ఎలికా శ్రీను చీరాల మండలం కీర్తివారిపాలెంలో 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.