చీరాల : లాక్ డౌన్ కారణంగా చీరాల జయంతిపేట ప్రాంతంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు వైసిపి ఇంచార్జ్ ఆమంచి కృష్ణ మోహన్ ఆదేశాలతో కోండ్రు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం 31, 32, 33వార్డులలో 1000 మంది పేద కుటుంబాలకు ఒకొక్కరికి 5కేజీల చొప్పున కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ కన్వీనర్ యడం రవి శంకర్, చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నేటి రవి, మాజీ మున్సిపల్ చైర్మన్ మొదడుగుల రమేష్, మాజీ కౌన్సిలర్ గుద్దాంతి సత్యనారాయణ, తేళ్ల కోటేశ్వరరావు, పాపబత్తుల థామస్, కొండ్రు థామస్, సల్లూరి అనిల్, కెకె యూత్ పాల్గొన్నారు.