చీరాల : శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ఆయన తనయుడు వైసిపి యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు సహకారంతో పట్టణంలోని హరీష్ పేట, 9వ వార్డులో వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, మాజీ ఎ ఎం సి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు చేతుల మీదుగా ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహించడంతో నియోజకవర్గంలో పేదలు నిత్యావసర సరుకులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ఆయన కుమారుడు వెంకటేష్ బాబు సహకారంతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లిల బుల్లిబాబు, హచ్ రమేష్, విజయ్ పాల్గొన్నారు.