చీరాల : కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ సమయములో రాష్ట్ర ప్రజలకు అతి తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేయాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు వైస్సార్సీపీ చీరాల ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ సారధ్యములో ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగొరీ నియోజకవర్గ స్థాయిలో 8వాహనాలలో మొబైల్ రైతు బజార్ లను ఏర్పాటుచేశారు. వీటిద్వారా శుక్రవారం చల్లారెడ్డిపాలెం పంచాయితీ టెంకాయచెట్లపాలెం, పొట్టిసుబ్బయ్య పాలెం, వేటపాలెం, దేశాయిపేట, దేవాంగపురి, రామకృష్ణాపురం పంచాయితీలలో, చీరాల మున్సిపాలిటీలో 23, 24, 31, 32వార్డులలో ఆయా గ్రామా సచివాలయాలు, వార్డు సచివాలయ పరిధిలో కూరగాయలు పంపిణీ చేశారు.
కార్యక్రమములో ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగొరీ, వైస్ చైర్మన్ శవనం సుబ్బారెడ్డి, డైరెక్టర్లు కనపర్తి బజ్జిబాబు, వూటుకూరి శ్రీనివాసరావు, షేక్ సత్తార్, కంది బుజ్జిమ్మ, కొండపల్లి స్థానక నిరంజనబాబు, ఏఎంసీ సిబంది, పంచాయితీ సెక్రటరీలు, వాలంటీర్లు, సచివాలయ సిబంది, వైస్సార్సీపీ కన్వీనర్ యడంరవి శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మొదడుగు రమేష్ బాబు, మాజీ కౌన్సిలర్ గుదంటి సత్యన్నారాయణ, కోటి దాసు, చెల్లి బాబురావు, చింత శ్రీను, అలెక్సు, సత్యానందం, చుక్క బుజ్జి, పందరబోయిన శ్రీకృష్ణ, చల్ల కోటేశ్వరరావు, డైయింగ్ బాబు, మల్లేష్, కేబుల్ శ్రీహరి, పాపిశెట్టి సురేష్, దావులూరి శ్రీను, చల్లా రామమోహన్, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.