బాపట్ల : తెలుగుదేశం కార్యకర్తల్లో ఎన్నికల వేడి రాజుకుంది. 2019శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఎంఎల్సి అన్నం సతీష్ ప్రభాకర్, వేగేశన ఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్రవర్మ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి టీసుకెళ్లడంలో పోటీ పడుతున్నారు. ఇద్దరు నేతల పోటాపోటీ కార్యక్రమాలతో బాపట్ల నియోజకవర్గ పరిధిలో పసుపు జెండా రెప రెపలాడుతుంది. కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతున్నారు.
సొంత నిధులతో… వేగేశన
ప్రముఖ పారిశ్రామికవేత్త, వేగేశన ఫౌండేషన్ ఛైర్మన్ వేగేశన నరేంద్రవర్మ తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తనవద్దకు సాయంకోసం వెళ్లే వారినివ్వర్నీ నొప్పించకుండా ప్రజల ఉమ్మడి అవసరాలు తీర్చడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. దేవాలయాలు, చర్చీల నిర్మాణాసునికి ఆర్థిక సహకారం అందించారు. వ్యక్తిగత ఆర్థిక సమస్యలపై సాయంకోసం వెళ్ళేవారికి తనవంతు సాయం చేయడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప జేసేందుజు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా గ్రామ పలకరింపు – ఇంటింటికి టిడిపి పేరుతో చేపట్టిన కార్యక్రమంలో నరేంద్రవర్మ కార్యకర్తలతోపాటు గ్రామాలు, బాపట్ల పాట్టణంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను పాలకరిస్తున్నారు. మహిళలకు చీరతోపాటు, గాజులు, పసుపు, కుంకుమ, టిడిపి అమలు చేసిన పథకాల బ్రోచర్ను అందజేశారు. నియొకవర్గం మొత్తం పర్యటిస్తున్నారు. ప్రతి ఇంటికి టిడిపి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తీసుకెళితున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయించడంలో ఎంఎల్సి అన్నం సతీష్ ప్రభాకర్ అధికారులను పరుగులు తీయిస్తున్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు చేర్చేందుకు అవసరమైన సూచనలు అధికారులకు చేస్తున్నారు.