బాపట్ల (DN5 News) : ‘జన్ సంవాద్’ ప్రచార కార్యక్రమాల భాగంగా విబిజిఆర్‌ఎఎంజి చట్టం2025కు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతిపాదితమైన ఈ చట్టం ఉద్దేశాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించేలా జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 24 వరకు ‘జన్ సంవాద్’ పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు చురుకుగా పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






