Home ప్రకాశం కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి దళిత నేత ఎల్ రవిబాబు ఒక లక్ష...

కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి దళిత నేత ఎల్ రవిబాబు ఒక లక్ష విరాళం

226
0

ఒంగోలు : కరోనా బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి టంగుటూరు మండలం వాస్య పల్లెపాడు మాజీ సర్పంచ్, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంగుంట రవిబాబు ఒక లక్ష రూపాయలు విలువైన చెక్కును రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసులురెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సహాయం అందజేయడం లో ముందుకు వచ్చిన లింగంగుంట రవిబాబును అభినందించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు మానవతాదృక్పదంతో సహాయం చేసినవారు గొప్పవ్యక్తులుగా సమాజంలో నిలిచిపోతారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునందుకుని సీఎం సహాయనిధికి తమవంతు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు.