కందుకూరు : కరోనా లాక్ డౌన్ సందర్భంగా పనులు లేక ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్న సంచార జాతులవారు 200మందికి వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో 30వ రోజుకూడా ఆహారం అందజేశారు. బుచ్చయ్య పెళ్లి రోజు సందర్భంగా పేదలకు, విప్పగుంట రోడ్డునందు గల సంచార జాతులవారికి మునిసిపల్ కమీషనర్ మనోహర్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఫోటోల కోసం కాకుండా ముప్పై రోజుల నుండి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బయటకు వచ్చి సేవచేయటం గొప్పవిషయమని టీం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకటకేశవరావు, చలంచర్ల సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్రశేఖర్, సైకాలజిస్ట్ పసుపులేటి పాపారావు, ఇస్కాల మధు పాల్గొన్నారు.