Home ప్రకాశం చోడవరంలో గడపగడపకి అశోక్ బాబు – గుంటుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విజయవంతం

చోడవరంలో గడపగడపకి అశోక్ బాబు – గుంటుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విజయవంతం

556
0

కొండపి (దమ్ము) : కొండేపి మండలం చోడవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గ్రామ పార్టీ అధ్యక్షులు గుంటుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబు వారి సతీమణి లక్ష్మీ పాల్గొన్నారు. ఈసందర్బంగా గ్రామ ప్రజలు పూలజల్లులతో స్వాగతం పలికారు. అశోక్ బాబు ప్రతిఇంటికి వెళ్లి ప్రభుత్వం నుండి వారికి అందుతున్న సంక్షేమ పథకాలను వివరించి, అందని వారి సమాచారం తీసుకొని త్వరలో పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గోగినేని వెంకటేశ్వర్లు, ఆరికట్ల కోటిలింగం, గుంటుపల్లి రమేష్, గుంటుపల్లి శ్రీను, గుంటుపల్లి వెంకట్రావు, పోకూరి కోటయ్య, మూగచింతల కోటి, బాలకృష్ణారెడ్డి, మోచర్ల అంజలి, మోచర్ల నారాయణ, గడ్డం మాల్యాద్రి, బుర్రి చిరంజీవి, కాకుమాను శోభన్ బాబు, నెన్నూరుపాడు వెంకటేశ్వర రెడ్డి, కల్లకుంట కొండయ్య, పరుచూరి శ్రీను, ముప్పనేని మధు, రేగలగడ్డపాలెం సుబ్బయ్య, వేముల ప్రసాద్, పోటు శ్రీను, పూనాటి శ్రీను, ఎ. గోవింద కృష్ణమూర్తి, శ్రీనివాస్ రెడ్డి మరియు గ్రామస్తులు,మండలంలోని అన్ని గ్రామాల నాయకులు,అధికారులు పాల్గొన్నారు.