వేటపాలెం : మండలంలోని సెయింట్ ఆన్స్ గ్రూప్ ఆఫ్ కళాశాలల సెక్రటరీ వనమా రామకృష్ణారావు 60వ జన్మదిన వేడుకలు ఆదివారం కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, మేనేజర్ ఆర్‌వి రమణ మూర్తి, అక్రిడేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సిఎస్ రావు, వివిథ విభాగాధిపతులు డాక్టర్ పి హరిణి, డాక్టర్ డి రాజేంద్రప్రసాద్, ఎస్‌విడి అనిల్, సి హరికిషన్, కె విజయభాస్కరరెడ్డి, కె సుబ్బారావు, ఈమ్మనియాల్, అమర్నాథ్, ఇంద్రనీల్, టి కిరణ్ కుమార్, లక్ష్మి తులసి, వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు ఆయనను కలిసి పుష్ప గుచ్చంలతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పంచారు. పుట్టినరోజు సందర్భంగా గ్రామంలోని అనాధ వృద్ధ శరణాలయంలో అన్నదానం చేశారు.






