Home Uncategorized శ్రీ కొందండ రామాలయానికి పోటెత్తిన భక్త జనం

శ్రీ కొందండ రామాలయానికి పోటెత్తిన భక్త జనం

195
0

– భక్తులకు తీర్ధ ప్రసాదాల వినియోగం

– కార్తీక పౌర్ణమి సందర్బంగా శ్రీ కొందండ రామాలయంలో పూజలు

చీరాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడరేవు సముద్ర తీరానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే భక్తులు తీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సముద్ర తీరంలో పూజా కార్యక్రమాల అనంతరం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు ఆలయ అధికారి జీవీఎల్ కుమార్ దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు పులిహోర ప్రసాద వినియోగం జరుగుతుంది.

బాపట్ల : సూర్యలంక సముద్ర తీరంలో కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం రావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వేకువ జామునే సముద్ర తీరమునకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక దీపారాధనలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు ఎవరైనా ప్రమాదానికి గురైతే ఆదుకునేందుకు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు.