చీరాల : వాడరేవు సముద్ర తీరానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం మద్యాహ్నం వరకు అమావాస్య ఉండటం, కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చివరి అమావాస్య కావడంతో వేకువ జామునుండే సముద్ర తీరానికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక దీపారాధన చేసి గంగకు హారతి పట్టారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు పోలీసులు రక్షణ చర్యలు తీసుకున్నారు. తీరంలో సముద్ర స్నానాలకు వచ్చిన జనంతంతో పండుగ వాతావరణం కనిపించింది.